Event-Date: | 10-Jul-2019 |
Level: | International |
Topic: | Foreign relations |
* భారత ఆయుధశ్రేణిలో అత్యధిక భాగం రష్యా తయారీవే. రైఫిల్స్ నుంచి యుద్ధ విమాన వాహకనౌకల వరకూ భారత్ సమకూర్చుకుంటున్న ప్రతి ఆయుధంలో రష్యా సహకారం ఉండాల్సిందే.
* అయితే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో మనం వ్యూహాత్మకంగా అమెరికావైపు తప్పక నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది.
* దీంతో ఇటీవల కాలంలో భారత్ చేసే ఆయుధాల కొనుగోళ్లలో రష్యా వాటా గణనీయంగా తగ్గుతోంది.
* ఇజ్రాయేల్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలతో ఆయుధ కొనుగోళ్లు పెరుగుతున్నా ఇప్పటికీ రష్యానే భారత్‌కు అతిపెద్ద ఆయధాల అమ్మకందారు.
* ఇప్పుడు కూడా భారత్ యుద్ధ విమానాల నుంచి సబ్మెరైన్ల వరకూ రష్యాతో భారీ ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
* ఐదవతరం ఫైటర్‌జెట్‌తో సహా అత్యాధునిక ఆయుధాల శ్రేణిని భారత్‌లోనే తయారుచేసేలా రష్యాతో డీల్ కుదుర్చుకునేలా చర్చలు ప్రారంభించింది.
* భారత్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఆరు డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల బిడ్‌లో రష్యా కూడా పాల్గొంది.
* తన దగ్గర గల సబ్‌మెరైన్ ఆర్మర్-1650ని భారత్‌లోనే తయారీకి ఒప్పుకుంటామని చెప్తోంది.
* భారత్‌గానీ ఈ బిడ్‌ను తమకే ఇస్తే కేవలం వాటిని అమ్మడమే గాక భారత్ భాగస్వామ్యంతో తయారుచేస్తామని అంటోంది.
* ఇతర దేశాలు తమ టెక్నాలజీనీ ఇవ్వడానికి ఇష్టపడని చోట మేం భారత్‌కు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ సబ్మెరైన్ల నిర్మాణం కూడా మరో విజయవంతమైన రష్యా-భారత్ తయారీ బ్రాహ్మోస్ కాగలదని విశ్వాసం వ్యక్తం చేసింది.
* ఇక భారత వాయుసేనలో కూడా మెజార్టీ వాటా రష్యా యుద్ధ విమానాలదే.
* మన గగనతలాన్ని శక్తివంతం చేసిన అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్-30తో సహా మిగ్ శ్రేణి విమానాలతో మన ఎయిర్‌బేస్‌లు నిండిపోయాయి.
* రష్యా తయారుచేస్తోన్న ఐదవతరం అత్యాధునిక సుఖోయ్-57 ఫైటర్జెట్లలో తొలి విదేశీ భాగస్వామ్య దేశం భారతదేశమేనని రష్యా నమ్మకం.
* ఇరుదేశాలు ఇప్పటికే కలష్నికోవ్-200 రకం రైఫిల్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 7,50,000 రైఫిల్స్ కావాలని భారత్ ఆర్డర్ కూడా ఇచ్చింది.
* టి-90 యుద్ధ ట్యాంకుల స్థానంలో అప్‌గ్రేడ్ చేసిన టి-90ఎమ్ఎస్ శ్రేణి కొనుగోలు కోసం 1.93 బిలియన్ డాలర్ల డీల్ ఇరుదేశాల మధ్య కుదిరింది.
* ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థది. వీటిని కొనుగోలు చేయరాదంటూ అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్నా భారత్మాత్రం వెనుకడుగు వేయడం లేదు