Current Affairs Telugu Daily

 సిరిసిల్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో వీధి విక్రయ దుకాణాల నిర్మాణం
*  రాష్ట్రంలో మొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారు చేసిన సామగ్రితో వీధి విక్రయ దుకాణాలను నిర్మించి ఇచ్చారు.
*  ప్లాస్టిక్‌ వ్యర్థాలను పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తిగా మార్చడం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. వీటిని ఉపయోగించి గృహ, ఇతర నిర్మాణాలకు అనువుగా పునర్వినియోగిస్తున్నారు.
*  వాటితో సిరిసిల్ల పురపాలక సంఘం రూ.96 లక్షలతో 60 వీధి విక్రయ దుకాణాలను ప్రతిపాదించారు.
*   పట్టణంలో అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు వీధి విక్రయ దుకాణాలను కేటాయిస్తున్నారు.
*  వీధి వ్యాపారులకు తక్కువ ఖర్చుతో శాశ్వత ఉపాధిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రణాళికలు రూపొందించారు.
*  ఈ దుకాణాల ఏర్పాటుతో పట్టణ పరిశుభ్రతకు దోహదపడనుంది. ఇక్కడ నిర్మాణాలు పూర్తయితే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగర, పురపాలక సంఘాల్లో వీటిని విస్తరించనున్నారు

views: 693



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams