Current Affairs Telugu Daily

గాంధీ జయంతి నుంచి మోడీ టీం 'పాదయాత్ర' బాట
* భాజపాకు చెందిన ఎంపీలంతా తమ నియోజకవర్గాల పరిధిలో 150కి.మీ. మేర పాదయాత్రలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
* మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్‌ 2 నుంచి సర్దార్‌ సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ జయంతి అక్టోబర్‌ 31వ తేదీ వరకూ ఈ పాదయాత్రలు సాగాలని కోరారు.
* ఈ యాత్రలను ఆ తరవాత జనవరి 30న నిర్వహించే మహాత్మాగాంధీ వర్ధంతి వరకూ కూడా కొనసాగించవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
*   ‘ఈ పాదయాత్రల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ 150 బృందాలను ఏర్పాటు చేయాలి.
*  ఈ యాత్రలు గ్రామాలపై దృష్టిపెట్టి ప్రజలతో మమేకమయ్యేలా సాగాలని ప్రధాని ఆకాంక్షించినట్లు సహాయ మంత్రి వివరించారు.
*   ప్రభుత్వ పనితీరుపై  ప్రజలు ఏమనుకుంటున్నారు  వారు సర్కారు నుంచి ఏమి కోరుకుంటున్నారన్నది తెలుసుకోవడం ఈ యాత్రల ప్రధాన ఉద్దేశమన్నారు.
*  మహాత్మా గాంధీ ఆలోచనా విధానాలను కూడా ఈ సందర్భంగా ఎంపీలు ప్రజల్లోకి తీసుకువెళతారని చెప్పారు.
*   ఈ పాదయాత్రల్లో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపట్టాలని నరేంద్ర మోదీ ఎంపీలకు సూచించారు.

views: 589

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams