Current Affairs Telugu Daily

ఇండియాకు ట్రంప్‌ మరో వార్నింగ్‌

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లకు సంబంధించి  మరోసారి భారత్ మీద విరుచుకుపడ్డారు.
* ట్విటర్‌ వేదికగా భారత్ చర్యలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు.
* జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ20 సమావేశంలో భాగంగా టారిఫ్‌లకు సంబంధించి ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చలు జరిగి రెండు వారాలు కూడా కాకముందే మరో సారి విమర్శలకు దిగడం గమనార్హం. 
* ‘అమెరికా ఉత్పత్తుల మీద టారిఫ్‌లు విధించి, భారత్ ఎప్పటి నుంచో లాభపడుతోంది. ఇక ముందు ఇది అంగీకారయోగ్యం కాదు’ అని ట్రంప్‌ ట్వీట్ చేశారు.
*  త్వరలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అంశాలను పరిష్కరిచేందుకు భారత్, యూఎస్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి  ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం.
*   దీనికి సంబంధించి యూఎస్‌ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌(యూఎస్‌టీఆర్) అధికారులు  దిల్లీకి రానున్నారు. ఒసాకాలో ఇరు దేశాల అధినేతల సమావేశం అనంతరం ఈ చర్చలు జరుగుతాయని వెల్లడించారు. 
* భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తుల మీద యూఎస్‌ పన్నులు ఎత్తివేసినప్పటికీ, భారత్ మాత్రం ఆ దేశానికి చెందిన 28 ఉత్పత్తుల మీద అధిక మొత్తంలో టారిఫ్‌లు విధించింది.
* ఈ కామర్స్‌ రంగంలో మనదేశం అవలంబిస్తోన్న కఠిన నిబంధనలు కూడా భారత్‌లో నడుస్తోన్న కొన్ని యూఎస్‌ సంస్థల మీద ప్రభావం చూపుతుండటం తో  ట్రంప్ ఆగ్రహాని  వెల్లడించారు   


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams