Current Affairs Telugu Daily

 135 పుస్తకాలు రాసిన 12 ఏళ్ల మృగేంద్రరాజ్‌

 * ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మృగేంద్రరాజ్‌ అనే 12 ఏళ్ల ఓ బాలుడు పుస్తక రచనలో అద్భుత ప్రతిభను కనబర్చుతు 135 పుస్తకాలు రాశాడు.
* ఆధ్యాత్మికం, ప్రముఖుల జీవిత చరిత్రలను ఆ బాలుడు రాస్తున్నాడు.
* మృగేంద్ర రాజ్‌ అద్భుత ప్రతిభను గుర్తించిన లండన్‌లోని ‘వరల్డ్‌ రికార్డ్‌ యూనివర్సిటీ’ తమ వర్సిటీలో డాక్టరేట్ చేయాలని అతడికి ఆహ్వానం పంపింది.
*  తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆ బాలుడు పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు. మొదటి పుస్తకాన్ని పద్యాల రూపంలో రాశాడు.
* రామాయణంలోని 51 పాత్రలను విశ్లేషించి కూడా రాజ్‌ పుస్తకాలు రాశాడు.
*  కొందరు రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను కూడా రాశాడు. 
* వివిధ అంశాలపై, సాహిత్య ప్రక్రియలపై పుస్తకాలు  రాస్తున్నాడు. . 
* ఇప్పటికే ఆ బాలుడు నాలుగు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు.
* ‘నేటి అభిమన్యు’ అనే కలం పేరుతో రచనలు చేస్తున్నాడు.  


views: 654



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams