Current Affairs Telugu Daily

 ప్రవేటు రంగంలోనూ 70శాతం రిజర్వేషన్లు అమలు

*  ప్రవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది
*  ఈ మేరకు  ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రకటించారు. స్థానిక యువకులకు 70శాతం ఉద్యోగాలు రిజర్వ్‌ అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
*  దీని ద్వారా నిరుద్యోగ యువతకు న్యాయం చేకూరుతుందని  ఇప్పటికే రాష్ట్ర పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.
*  70శాతం రిజర్వేషన్లు అమలు చేసిన పరిశ్రమలకే రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు అందుతాయని స్పష్టం చేశారు. దీన్నే చట్టంగా మారుస్తామని తెలిపారు.
*  రాష్ట్రం వెలుపలి వారికి ఉద్యోగాల్లో వయసు సడలింపు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఏ చర్యలు తీసుకున్నా స్థానికులపై ప్రభావం లేకుండా చూస్తామని తెలిపారు
* అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానికులకు ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
*  రిజర్వేషన్లు కల్పించిన ప్రైవేటు సంస్థలకు పలు రాయితీలు కల్పిస్తూ పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
* భారత రాజ్యాంగం లో  రిజర్వేషన్లు అమలు గురించి ప్రాథమిక హక్కుల  విభాగంలోని ప్రకరణ 15(4) లో మొదటి రాజ్యాంగ సవరణ 1951 ద్వారా ఈ క్లాజు చేర్చబడింది.
* సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడినవారు లేదా షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి అభ్యున్నతి  కోసం ప్రత్యేకమైన నిబంధనలు ప్రభుత్వం జారీచేసింది


views: 617

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams