Current Affairs Telugu Daily

అతి పొడవైన విద్యుదీకరించిన రైలు సొరంగ మార్గం
* భారతీయ రైల్వేలో అతి పొడవైన విద్యుదీకరించిన రైలు సొరంగ మార్గం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూరు-చెర్లోపల్లి స్టేషన్ మధ్యలో వెలిగొండ కొండల క్రింద 6.6 కిలోమీటర్ల పొడవున గుర్రపు నాడా ఆకారంలో దీనిని నిర్మించారు.
* SCR జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తొలి గూడ్స్ రైలుకు జెండా ఊపి మార్గాన్నిప్రారంభించారు. 
* ఓబులవారిపల్లి-వెంకటాచలం మధ్య కొత్తగా నిర్మించిన రైల్వే లైన్లలో సొరంగ మార్గం ఒక భాగం.
* కృష్ణపట్నం పోర్ట్ తో పాటు తీర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గూడ్స్ రైళ్ళకు ఈ మార్గం వీలు కల్పిస్తుంది.         దీంతో కృష్ణ పట్నం పోర్టు - తీర ప్రాంతాల మధ్య 60 కిలో మీటర్ల దూరం తగ్గింది.
*న్యూ ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ మెథడ్ తో నిర్మించిన ఈ మార్గం వ్యయం 460 కోట్లు 

views: 1057



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams