* ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
* అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయంటూ ఇరాన్ ఆంక్షలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షాంగ్ అమెరికా తీరును తీవ్రంగా విమర్శించారు.
* 2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడమేగాక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆంక్షలు విధించి ఇరాన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
* ఇరాన్‌తో బాధ్యాతాయుతమైన చర్చలు జరపాలని కోరారు. ఇరాన్‌పై అమెరికా విధించే ఆంక్షలపై చైనా తీవ్రంగా స్పందించడం ఇదే తొలిసారి.
* అమెరికా గత కొంతకాలంగా ఇరాన్‌పై ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి.
* దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. అయినా ఆంక్షలకు భయపడని ఇరాన్, యురేనియం నిల్వలను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
* 2015లో ఒప్పందంపై సంతకాలు చేసిన యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరినా సరైన స్పందన లేకపోవడంతో అమెరికాతో తలపడాలనే ఇరాన్ నిర్ణయం తీసుకుంది.
views: 697