Current Affairs Telugu Daily

 మొట్టమొదటి అంగారక రోవర్‌ సిద్ధంచేసిన  చైనా
 *  అంగారకుడిపైకి మొట్టమొదటిసారిగా చేపడుతున్న యాత్ర కోసం రోవర్‌ నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది.
*  వచ్చే ఏడాది దీన్ని ప్రయోగించాలనుకుంటోంది.
*  ఏడు నెలలు ప్రయాణించి అది అంగారకుడి వద్దకు వెళుతుంది.
* ఈ యాత్రలో భాగంగా ఆ గ్రహ కక్ష్యలోకి ఆర్బిటర్‌ను, ఉపరితలం మీదకు ల్యాండర్‌, రోవర్‌ను చైనా పంపుతోంది. 
*  అంగారకుడి వాతావరణం, ఉపరితలం, అయస్కాంత క్షేత్రంపై పరిశోధనలు సాగిస్తుంది.
* రెడ్ ప్లానెట్ అని  అంగారక గ్రహం అంటారు. 
* అంగారకునికి, రెండు ఉపగ్రహాలు గలవు. అవి ఫోబోస్ మరియు డెయిమోస్.
* 1964 లో నాసా వారు మొదటి సారిగా అంగారకునిపై విజయవంతంగా మార్టినర్ 4 ను ప్రయోగించారు.
* ఇప్పటివరకు వివిధ దేశాలు 51 మిషన్లను అంగారక కక్ష్యలోకి పంపగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి. 
* మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకోగలిగింది
* భారత్ PSLV-C25 ద్వార 5-11-2013 న మామ్ ని ప్రయోగించారు.
 

views: 743

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams