Current Affairs Telugu Daily

విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌కు10వేల కోట్లు ఆర్డర్‌ను రక్షణ మంత్రిత్వశాఖ కేటాయించింది
* విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) చరిత్రలోనే తొలిసారిగా రూ. 10 వేల కోట్ల విలువైన ఆర్డర్‌ను రక్షణ మంత్రిత్వశాఖ కేటాయించింది.
*  ఈ ఆర్డర్‌లో భాగంగా ఐదు భారీ యుద్ధనౌకల్ని హెచ్‌ఎస్‌ఎల్‌ నిర్మించనుంది.
* 78 సంవత్సరాల చరిత్ర కలిగిన షిప్‌యార్డ్‌ ఇప్పుడు ఒక్కోటి 45 వేల టన్నుల బరువుండే, యుద్ధనౌకలను బహుళ ప్రయోజనాలకు అనువుగా నిర్మించనుంది.
*  నేరుగా యుద్ధాల్లో పాల్గొనడం, యుద్ధాల్లో ఉన్న ఇతర నౌకలు, సిబ్బందికి అవసరమైన సామగ్రి, ఆహారాన్ని భారీఎత్తున అందించే మాతృనౌకల్లా (మదర్‌షిప్స్‌) కూడా అవి సేవలు అందించగలుగుతాయి.
*  మొదటి యుద్ధనౌకను నాలుగేళ్లలోపే నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది.
*  అధునాతన సాంకేతిక సహకారం కోసం టర్కీ దేశంలోని అన్నడోలు షిప్‌యార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. * * యుద్ధనౌకల డిజైన్లు, నిర్మాణానికి అవసరమైన పూర్తి సాంకేతిక పరిజ్ఞానాల్ని కూడా అన్నడోలు సంస్థ బదిలీ చేయనుంది.
* హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం (Hindustan Shipyard Limited) భారతదేశపు తూర్పుతీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో ఉన్నది.
* ఇది ఆధునిక భారతదేశపు మొట్టమొదటి నౌకానిర్మాణకేంద్రం.
* 1941 జూన్ 22న డా. రాజేంద్ర ప్రసాద్ దీనికి శంకుస్థాపన చేశాడు.
*  సింధియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లిమిటెడ్ లో భాగంగా వాల్‌చంద్ హీరాచంద్ అనే పారిశ్రామికవేత్త దీనిని స్థాపించాడు.
* అప్పట్లో దీనిని సింధియా షిప్‌యార్డ్ గా పిలిచేవారు.
*  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట నిర్మించిన మెట్టమొదటి నౌక "జల ఉష".
*  1948లో అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహరూ జలప్రవేశం చేయించారు.
* 1961వ సంవత్సరంలో జాతీయం చేయబడినపుడు, దీని పేరు హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అయింది.
*  2009 సంవత్సరంలో జలరవాణా మంత్రిత్వ శాఖ పరిధి నుండి రక్షణశాఖ పరిధిలోకి మార్చబడింది.
*  అరిహంత్ తరహా అణుజలాంతర్గాముల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నది.

views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams