Current Affairs Telugu Daily

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి టాటామోటార్స్ సిద్ధం

* ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మారేందుకు టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉందని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు 
*  పర్యావరణ అనుకూలమైన ఈ వాహనాలను ఉత్పత్తి చేసే అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
*  అత్యధిక జనాభా కలిగిన భారత్‌లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో అవసరమని టాటా మోటార్స్‌ 2018-19 వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
* దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని.. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉందన్నారు .
* ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
* తాజాగా బడ్జెట్‌లో ఎలక్ర్టిక్‌ వాహనాల కొనుగోలు కోసం తీసుకునే రుణ వడ్డీపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
* ఈ చర్యల ద్వారా ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకి, వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.
* సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలు ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని వాటి స్థానంలో ఎలక్ర్టిక్‌ వాహనాలు వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
*  టాటా మోటార్స్‌ ప్రారంభం ;  1945.
* టాటా మోటార్స్‌ ప్రధాన  కార్యాలయం ; ముంబై .
*టాటా మోటార్స్‌ CEO; Guenter Butschek

 

 


views: 711

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams