Current Affairs Telugu Daily

మిషన్ బ్రహ్మోస్: భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణి

* భారత్‌, రష్యాలు సంయుక్తంగా రూపొందించిన సూపర్‌సొనిక్‌ క్షిపణి బ్రహ్మోస్‌కు సంబంధించి మెరుగుపరచిన వెర్షన్‌ను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ సీఈవో సుధీర్‌ మిశ్ర చెప్పారు

* ఇది 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని తెలిపారు.

* క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌)లో భారత్‌కు సభ్యత్వం లభించిన నేపథ్యంలో ఇది సాధ్యమైందన్నారు.

* బ్రహ్మోస్‌ క్షిపణులను యుద్ధవిమానాలకు అనుసంధానించామని చెప్పారు.

* దీర్ఘశ్రేణి అస్త్రాలను యుద్ధవిమానాలకు అమర్చిన ఏకైక దేశంగా భారత్‌ అవతరించిందన్నారు.

* బ్రహ్మోస్ ఒక తక్కువ పరిధి, ర్యామ్‌జెట్, సూపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణి. నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి), ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.

*భారత్‌కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయేనియాలు  సంయుక్తంగా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి, భారత్‌లో ఈ క్షిపణిని తయారు చేస్తున్నాయి.

*రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని తయారుచేసారు.

* భారత దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యా లోని మోస్క్వా నది - ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడినదే బ్రహ్మోస్. 


views: 743



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams