Current Affairs Telugu Daily

చంద్రయాన్‌-2.. ఇస్రో స్పెషల్‌ వీడియో

 *భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘చంద్రయాన్‌-2’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది
* ఈ నెల జులై 15న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

* ప్రయోగానికి ఇంకా వారం రోజులు ఉందనగా ఇస్రో చంద్రయాన్‌-2కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

*ఇస్రో వీడియోను ట్విటర్‌లో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) షేర్‌ చేసింది.

* ‘‘మేం సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా? రోవర్‌ ఆధారిత భారత తొలి స్పేస్‌ మిషన్‌ ‘చంద్రయాన్‌ 2’. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే ప్రపంచపు తొలి రోవర్‌ ఇది’’ అని పేర్కొంది.

*చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టే భారత రెండో మూన్‌ మిషన్‌ అయిన చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనున్నారు. 

*ప్రయోగం అనంతరం ఇది దాదాపు 16 రోజులు భూకక్ష్యలో తిరిగి అనంతరం చంద్రుడి దిశగా కదులుతుంది.

* అలా సెప్టెంబర్‌ 27న చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. అనంతరం అక్కడ ప్రయోగాలు చేపట్టనుంది. 

*మరోవైపు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో చంద్రయాన్‌-2 ప్రయోగ సందడి నెలకొంది.

* జులై 15వ తేదీన తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌-2 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఇస్రో గతం లో చంద్రయాన్ 1 george joseph సూచనల మేరకు 2008 అక్టోబర్ 22నాడు PSLV - 22 రాకెట్ ద్వారా చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ - మలయా స్వామిఅన్న దురై. ఈ యాత్ర ను చేపట్టినా మొదటి  దేశం అ మెరికా కాగా ,

6వ  దేశం ఇండియా


views: 744



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams